Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతా ఓం'నమో-నారా'యణాయ మంత్రమే: చిత్తూరు ఎంపీ శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇప్పుడు ఓం 'నమో-నారా'యణాయ మంత్రాన్ని పఠిస్తున్నారని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ప్రధాని నరేంద్ర మోదీ వద్ద విన్నవించారు. 'నమో' అంటే నరేంద్ర మోదీ అని, 'నారా' అంటే నారా చంద్రబాబునాయుడని చెప్పిన ఆయన తనదైన శైలిలో నవ్వులు పూయించారు. తెలుగుదేశం ఎంపీలతో ప్రధాని భేటీ అయిన వేళ, రాష్ట్ర సమస్యలను, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని వివరిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. మోదీ, బాబులు తమ రాష్ట్రాన్ని ఆదుకుంటారని ఏపీ ప్రజలంతా గంపెడాశతో ఉన్నారని, వారి ఆశలను నెరవేర్చాలని మోదీకి తెలిపినట్టు శివప్రసాద్ వ్యాఖ్యానించారు.

More Telugu News